HomeTelugu Trending32 కోట్లకు 'నా సామి రంగం' నాన్‌ థియేటర్‌ రైట్స్‌!

32 కోట్లకు ‘నా సామి రంగం’ నాన్‌ థియేటర్‌ రైట్స్‌!

Naa Saami Ranga Non Theat

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాసామి రంగ’. విజయ్ బిన్ని డైరెక్షన్లో వస్తున్న ఈసినిమాలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌ కీ పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టైటిల్ గ్లింప్స్‌ వీడియో సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్‌ చేశాయి. ఇటీవలే విడులైన ‘నా సామి రంగా’ టైటిల్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి14)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో మూవీకి సంబంధించిన నాన్‌థియేటర్‌ రైట్స్‌ 32 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. డిజిటల్‌, శాటిలైట్‌ హాక్కులను మా టీవీ, హాట్‌ స్టార్‌, హిందీ హాక్కులను థర్డ్‌ పార్టీ కోనుగోలు చేసినట్లు టాక్‌. మొత్తం కలిపి 32 కోట్ల వరకూ వచ్చినట్లు వినికిడి.

దాదాపు 45కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున 12కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో దాదాపు ఇప్పటికే మూడు వంతులు రీకవరి అయింది. అన్నపూర్ణ ప్రోడక్షన్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ మరియే దిల్‌రాజ్‌ ప్రోడక్షన్స్‌ కూడా పలు చోట్ల పంపిణి చేస్తున్నారు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!