జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక
వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యింది. అయితే 2015లో ’36 వయదినిలే’ చిత్రంతో
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తన భర్త సూర్య తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాతో జ్యోతికకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల
ముందుకు రానుంది. బ్రహ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కూడా సూర్యనే నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో జ్యోతిక ఓ జర్నలిస్ట్ గా దర్శనమివ్వనుంది. విజయదశమి కానుకగా ఈ సినిమా
ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్యోతికతో పాటు భానుప్రియ, ఊర్వశి వంటి సీనియర్
నటీమణులు కూడా ఉన్నారు. తెలుగ, తమిళ బాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది
చిత్రబృందం ఆలోచన.

CLICK HERE!! For the aha Latest Updates