నార్త్‌లో సల్మాన్.. సౌత్‌లో ఎన్టీఆర్‌!

వెండితెర, బుల్లితెర అనే తేడాలేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని మించిన హీరో లేడనే చెప్పుకోవచ్చు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో.. ‘బిగ్ బాస్’ తొలి సీజన్‌లో బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత విందునిచ్చారు. అలా అలా ఎన్టీఆర్ అభిమాన వర్గం పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ అంటే సౌత్ ఆడియన్స్‌లో ఎనలేని క్రేజ్ వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ క్రేజ్‌ని క్యాచ్ చేసుకుంటూ తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవాలని భావించిన యాపీ ఫిజ్‌ వారు ఎన్టీఆర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు తమ బ్రాండ్ యాపీ ఫిజ్‌కి ప్రచారకర్తగా ఎన్టీఆర్‌ని నియమించుకున్నారు. అంటే ఈ సారి ఆపీ ఫిజ్‌ యాడ్‌తో ఎన్టీఆర్ బుల్లితెర విందునీయనున్నారన్నమాట! ఆపీ ఫిజ్‌తో తాను ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్‌ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. నార్త్‌లో ప్రస్తుతం దీనికి ప్రచారకర్తగా సల్మాన్ ఖాన్ కొనసాగుతున్నారు.