HomeTelugu Trendingబాలీవుడ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ మూవీ?

బాలీవుడ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ మూవీ?

8 1

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరవాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ‘అయిననూ పోయి రావలే హస్తిన’ కు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తారక్ త్వరలో ఓ బడా బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

పీరియాడిక్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తెరకెక్కించిన పద్మావత్‌, భాజీరావు మస్తానీ, దేవదాస్‌, రామ్ లీలా చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. తాజాగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌తో భారీ పీరియాడికల్ మూవీ చేసినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈసినిమాలో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu