HomeTelugu Trendingహిట్‌ సీక్వెల్స్‌తో హీరోగా ఎన్టీఆర్‌ బావమరిది!

హిట్‌ సీక్వెల్స్‌తో హీరోగా ఎన్టీఆర్‌ బావమరిది!

Jr ntr brother in law narne

టాలీవుడ్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బావమరిది హీరోగా ఏంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి పేరు నార్నే నితిన్ చంద్ర. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతికి తమ్ముడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుని నార్నే నితిన్ చంద్ర పూర్తి ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. డ్యాన్సులు.. ఫైట్స్ లోనూ శిక్షణ తీసుకున్నారని తెలిసింది.

ఉదయ్ కిరణ్ .. నితిన్ లాంటి హీరోల్ని వెండితెర కథానాయకులుగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ తేజ తారక్ బావమరిది నార్నే నితిన్‌ని కూడా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. కథల ఎంపిక నుంచి ప్రతి విషయం ఎన్టీఆరే దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి చిత్రం 1.1 అనే టైటిల్ ఫిక్స్ చేసిన తేజ ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించనున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆడిషన్స్ లో హీరోని ఎంపిక చేసి 40 మంది ఆర్టిస్టుల్ని కొత్తవారిని ఫైనల్ చేశారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu