
NTR Neel Cast:
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
తాజా బజ్ ప్రకారం, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మేకర్స్‌తో ఆమె చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఊర్వశి గతంలో ‘వాల్తేరు వీరయ్య’లో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి స్పెషల్ సాంగ్ కాదని, అసలు కథలోనే ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించారని తెలుస్తోంది.
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలవనుందని అందరూ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ‘కేజీఎఫ్’, ‘సలార్’లాంటి బిగ్ బ్లాక్‌బస్టర్స్‌ను అందించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి మరొక సెన్సేషనల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. కానీ ఎన్టీఆర్ మాత్రం వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. అప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఊర్వశి రౌతేలా నిజంగా ఈ సినిమాకు అంగీకరిస్తే, ఎన్టీఆర్ మూవీకి మరో గ్లామర్ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది.
ALSO READ: Prashanth Varma కోసం Brahma Rakshas అవతరంలోకి మారనున్న Prabhas