నటన వారసత్వంతో రాదు: ఎన్టీఆర్

ntr1'

‘టెంపర్’,’నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలతో హిట్స్ సాధించి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తూ..
ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జనతాగ్యారేజ్’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో
నిత్యమీనన్, సమంతలు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకు
సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. హీరో ఎన్టీఆర్ తో కాసిన్ని ముచ్చట్లు..
రభస సమయంలో చెప్పిన కథ..
కొరటాల శివ నేను రభస సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడూ ఈ కథ చెప్పారు. బాగా నచ్చింది.
కానీ చేయడం కుదరలేదు. నాకు తెలియకుండానే ఈ కథ వెనుక పయనించాను. ఇలాంటి
కథలు చాలా అరుదుగా దొరుకుతాయి.
క్లారిటీ ఉన్న దర్శకుడు..
కొరటాల శివకు కథ పట్ల చాలా క్లారిటీ ఉంది. లేకపోతే అంత మంది ఆర్టిస్ట్స్ ను హ్యాండిల్
చేయడం కష్టమైన పని. కొన్ని కథలను నటీనటులు డామినేట్ చేస్తారు. కానీ ఈ సినిమా అలా
మనుషులు, నేచర్ ల బ్యాలన్స్..
భూమి మీద మనుషులను ప్రేమించే వ్యక్తి ఒకరైతే.. భూమి మీద ఉండే మొక్కలను ప్రేమించే
వ్యక్తి మరొకరు. వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు.. కలిస్తే ఏం జరుగుతుంది. మనుషులను, నేచర్
ను ఎలా బ్యాలన్స్ చేస్తారు అనే అంశాలతో సినిమా ఉంటుంది.
అటువంటి వ్యక్తిని చూడలేదు..
ఈ సినిమా బలమైన పాత్ర కోసం మోహన్ లాల్ గారిని అనుకున్నాం. అంత పెద్ద నటుడైనా..
అతనిలో ఎలాంటి ఈగో ఉండదు. నేను ఇప్పటివరకు అలాంటి వ్యక్తిని కలవలేదు. మంచి
నటుడు కంటే మంచి మనిషాయన.
వారసత్వంతో రాదు..
నటన అనేది వారసత్వంతో రాదు. ఒకరు నేర్పిస్తే రాదు. మనం ఫీల్ అవ్వాలి. అప్పుడే బాగా
నటించగలం. వారసత్వంతో అవకాశాలు మాత్రమే వస్తాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
ప్రేక్షకులే కారణం..
ప్రస్తుతం ఇండస్ట్రీలో కథల ట్రెండ్ మారింది. పెళ్ళిచూపులు, మనమంతా ఇలా మంచి కథలతో
సినిమాలొస్తున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులే.. ఎందుకంటే వారి చెంపదెబ్బల వలనే మార్పు
వచ్చింది. నాకు కూడా ఆ దెబ్బలు తగిలాయి. అందుకే నాలో కూడా మార్పొచ్చింది.
యాక్టర్స్ ను చివరగా ప్రేమించాలి..
ఫ్యాన్స్ కొట్టుకోవడం మంచి విషయం కాదు. ముందుగా మన దేశాన్ని, తల్లితండ్రులను,
భార్యా బిడ్డలను, సమాజాన్ని ప్రేమించిన తరువాత చివరగా ఫేవరెట్ యాక్టర్స్ ను ప్రేమించాలి.
నా యాంబిషన్ అదే..
జీవితంలో మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి నటుడిగా అనిపించుకోవాలి. ఇదే నా
యాంబిషన్.
ఆయన తెలుగు వారి ప్రాపర్టీ..
తాతగారి బయోపిక్ లో నేను నటించడం కష్టం. ఆయన నా ఇన్స్పిరేషన్. నేనే బయోపిక్ లో
నటించాలని లేదు. ఆయన తెలుగు వారి ప్రాపర్టీ. వేరే ఎవరైనా బయోపిక్ చేసుకోవచ్చు.

CLICK HERE!! For the aha Latest Updates