HomeTelugu Trendingఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌

ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌

Jr ntr tested corona positi

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘తాజాగా చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది కోరుతున్నా’’ -ట్విటర్‌లో వేదికగా ఎన్టీఆర్‌ తెలియాజేశారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నాడు‌. రామ్‌చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు. మరోవైపు సినీ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, కంగనా రనౌత్‌, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలు తాము కరోనా బారినపడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్‌ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu