HomeTelugu Trendingమహేశ్‌ కోనేరు మృతిపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

మహేశ్‌ కోనేరు మృతిపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

JR ntr tweet on his pro mah

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ, ఈ‍స్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూసర్‌ మహేశ్‌ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.

ఈ క్రమంలో మహేశ్‌ మృతిపై జూ. ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ. ‘బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్‌ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఎన్టీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా మహేశ్‌ ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు, కల్యాణ్‌ రామ్‌లకు పీఆర్‌ఓ వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu