HomeTelugu Trendingఎన్టీఆర్‌ భార్య-కొడుకు ఫొటో వైరల్‌

ఎన్టీఆర్‌ భార్య-కొడుకు ఫొటో వైరల్‌

Jr ntr wife and son photo g
టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌.. మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు కొరటాల శివ మూవీ షూటింగ్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చే ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన భార్య లక్ష్మి ప్రణతి, చిన్న కుమారుడు భరత్‌ రామ్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.

ఇందులో ప్రణతి కొడుకు భరత్‌ రామ్‌ ఎత్తుకుని కనిపించారు. ఈ ఫొటో చూస్తుంటే ప్రణతి, భరత్‌ను ఆడించేందుకు కిడ్స్‌ గేమ్‌ జోన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తానికి ఇలా తమ అభిమాన హీరో తనయుడిని చూశాం అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. భరత్‌ చాలా క్యూట్‌గా ఉన్నాండంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా తారక్‌ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుంటాడు. అభయ్‌ రామ్‌, భరత్‌ రామ్‌లతో కలిసి సరద సమయాన్ని గడుపుతుంటాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu