HomeTelugu Trendingమహేష్‌తో పొటీపడనున్న అల్లు అర్జున్‌

మహేష్‌తో పొటీపడనున్న అల్లు అర్జున్‌

9 8

2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే విడుదల తేదీను ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. వేగంగా షూట్ చేస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. త్వరగా సినిమాను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు బన్నీ. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.

అల్లు అర్జున్ 19 వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అంటే.. మహేష్, బన్నీ సినిమాలు రెండు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. అయితే, సంక్రాంతికి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఓ క్లారిటి రావలసి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu