రివ్యూ: జ్యో అచ్యుతానంద

నటీనటులు: నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా
సంగీత దర్శకులు : శ్రీ కళ్యాణరమణ
ఫోటోగ్రఫి : వెంకట్ సి.దిలీప్
నిర్మాత : సాయి కొర్రపాటి
దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన శ్రీనివాస్ అవసరాల
సినిమాల్లో నటిస్తూనే.. మరొక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే
‘జ్యో అచ్యుతానంద’. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య జరిగే ఈ చిత్రం
ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
అచ్యుత రామారావు(నారా రోహిత్), ఆనంద్ వర్ధన్(నాగశౌర్య) వీరిద్దరు అన్నదమ్ములయినప్పటికీ
స్నేహితుల్లా మెలిగేవారు. అయితే సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లోకి జ్యో(రెజీనా)
అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. జ్యో వలన అచ్యుత్, ఆనంద్ ల జీవితాలు ఏ విధంగా మారాయి.
జ్యో కారణంగా వారిద్దరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. అనే విషయాలు తెలియాలంటే
సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
నాగశౌర్య, నారారోహిత్ , రెజీనా
స్టోరీ
ఫొటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
సంగీతం
విశ్లేషణ:
గతంలో అన్నదమ్ముల కథ నేపధ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా
వచ్చింది. ఆ సినిమాలో బావొధ్వేగాలతో కూడిన అనుబంధాలను చూపించారు. ఇప్పుడు
అదే కోణంలో వచ్చిన ఈ సినిమాలో మాత్రం హ్యూమర్ తప్ప మరొకటి లేదు. కానీ
అన్నదమ్ముల పాత్రలో శౌర్య, రోహిత్ లు అధ్బుతంగా నటించాడు. ఒక మనసు సినిమా
తరువాత శౌర్య నటనలో చాలా పరిణితి చెందాడు. ప్రతి భావాన్ని అధ్బుతంగా పలికిస్తున్నాడు.
కొన్ని సన్నివేశాల్లో రోహిత్ ను మించి నటించాడు. రోహిత్ ఈ సినిమాలో చక్కగా
నటించినప్పటికీ తన లుక్ మాత్రం సినిమాకు సెట్ కాలేదు. ఇప్పటికైనా రోహిత్ తన
బరువును తగ్గించుకునే బావుంటుంది. రెజీనా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసింది. ఒక నటిగా
ఈ సినిమాతో తనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీనివాస్ అవసరాల అనుకున్న కథను
ప్రేక్షకులను చెప్పే విధానంలో కొన్ని లాజిక్స్ ను మిస్ అయ్యాడు. అయితే ఎంటర్ టైన్మెంట్
కోరుకునే ప్రేక్షకులకు లాజిక్స్ తో పని ఉండదు. సినిమా కోసం అధ్బుతమైన సంబాషణలు
రాసుకున్నాడు. ఫొటోగ్రఫి బావుంది. సంగీతం మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. నేపధ్య
సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సివుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్: 2.75/5

CLICK HERE!! For the aha Latest Updates