HomeTelugu Trendingహీరోగా రాఘవేంద్రరావు

హీరోగా రాఘవేంద్రరావు

K raghavendra rao turns her
టాలీవుడ్‌లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన సినిమాలో నటిస్తే చాలు స్టార్ స్టేటస్ వస్తుందని హీరోలు, హీరోయిన్లు భావిస్తారు. అలా దశాబ్దాలుగా కెమెరా వెనకుండి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నారు. తొలిసారి హీరోగా నటించబోతున్నాడు.

ఆమధ్య ‘మిథునం’ వంటి రమణీయమైన చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో రాఘవేంద్రరావు హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి కథను అందించగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఈ సంచలన చిత్రంలో నలుగురు హీరోయిన్‌లు ఉంటారని అంటున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, శ్రియ, సమంతలను ముగ్గురు హీరోయిన్‌లుగా ఎంపిక చేయగా.. మరో కొత్త హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రమ్యకృష్ణ ఆయనకు భార్యగా నటిస్తుందట. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu