ఫ‌క్తు ప‌ల్లెటూరి చిత్రంగా ‘కాళి’!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన ‘చండివీర‌న్‌’ తెలుగులో ‘కాళి’ అనే పేరుతో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్‌, శ్రీగ్రీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్‌. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా….
ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ.. ”టీజ‌ర్ చాలా బావుంది. చూడ‌గానే టీజ‌ర్ న‌చ్చింది. ఒక‌ప్పుడు తెలుగులో హృద‌యం సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ముర‌ళి త‌న‌యుడు అధ్వ‌ర్య ఈ సినిమాలో హీరోగా న‌టించారు. నిర్మాత మ‌హేశ్వ‌ర‌రెడ్డి నాకు మంచి మిత్రుడు. సినిమా పెద్ద హిట్ కావాలి. అన్నీ ఎలిమెంట్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించే సినిమా అవుతుంది” అన్నారు.
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ.. ”త‌మిళంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల నిర్మించిన చిత్రాన్ని తెలుగులో బాల‌గారి స‌మ‌ర్ప‌ణ‌లోనే కాళి పేరుతో విడుదల చేస్తున్నాం. ఫ‌క్తు ప‌ల్లెటూరి చిత్ర‌మిది. నీటి కోసం రెండు ఊర్ల మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబ‌రాల నుంచి, ప‌ల్లెటూరి స‌ర‌సాలు, స‌ర‌దాల వ‌ర‌కు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి స‌గం ఆద్యంతం క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. రెండో స‌గం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. స‌న్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్త‌య్య కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సామాజిక స్పృహ‌తో సాగే చిత్ర‌మిది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. అరుణ‌గిరి అందించిన బాణీలు త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతాయి. స‌బేష్ – ముర‌ళి నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ‌, ఆనంది మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. తెలుగు వారికి కూడా త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అయ్యే సినిమా, ఫిభ్రవ‌రిలో మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here