HomeTelugu Trendingకాతు వాకుల రెండు కాదల్: తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది

కాతు వాకుల రెండు కాదల్: తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది

Kaathu vaakula rendu kaadha
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి… సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కలిసి నటించిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్‌.’ విఘ్నేష్‌ శివన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను శనివారం (ఏప్రిల్‌ 23) రిలీజ్‌ చేశారు. తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజ’ టైటిల్‌తో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు. ట్రైలర్‌లో ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీకి కామెడీ జోడించి డైరెక్ట్ చేశారు విఘ్నేష్‌ శివన్‌.

గని’ ఫైనల్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu