‘కబీర్‌ సింగ్‌’ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న సినిమా ‘కబీర్‌ సింగ్‌’. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ మూమీకు ఇది రీమేక్‌గా రాబోతోంది. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్‌’ ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లో చూపించిన సన్నివేశాలనే హిందీలోనూ చూపించారు. కానీ నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటోంది. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. జూన్‌ 21న ‘కబీర్‌ సింగ్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates