HomeTelugu Trendingప్రభుదేవాకు జంటగా కాజల్‌!

ప్రభుదేవాకు జంటగా కాజల్‌!

Kajal Agarwal opposite Prab

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవలే ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.

దీనితో పాటు కమల్‌ హాసన్‌‌ ‘ఇండియన్‌-2’లో కూడా నటిస్తుంది. తాజాగా కాజల్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ కోరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో కలిసి కాజల్ ఓ తమిళ సినిమా చేయబోతోందనేదే ఆ వార్త. కల్యాణ్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని… ఇది రొమాంటిక్ కామెడీ సినిమా అని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu