బాలీవుడ్ కు మళ్ళీ వెళుతోంది!

దక్షిణాదిన స్టార్ హోదా అనుభవిస్తున్నా.. మన కథానాయికలకు బాలీవుడ్ కల మాత్రమే అలానే ఉంటుంది. అక్కడ పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా.. తమ సినిమాలు ఆడకపోయినా సరే తమ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారు. ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తూ ఉంటారు. దీనికి టాలీవుడ్ బ్యూటీ కాజల్ కూడా మినహాయింపు కాదు. గతంలో బాలీవుడ్ లో సింగం, స్పెషల్ చబ్బీస్ వంటి సినిమాల్లో నటించింది కాజల్. వారి వల్ల కాజల్ కు ఒరిగిందేమీ లేదు. రీసెంట్ గా చేసిన ‘దో లఫ్జోంకి కహానీ’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా కోసం కాజల్ కొన్ని సౌత్ సినిమాల అవకాశాలు వదులుకుంది. ఎన్నో ఆశలతో చేసిన ఆ సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది.
ఇక్కడ ఆమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ కు టర్న్ తీసుకుంటోంది. ‘యామ్లా పగ్లా దీవానా’ ఫ్రాంచైసీలో భాగంగా రాబోతున్న మూడో సినిమాలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాజల్ కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది. బాబీ డియోల్ కు జంటగా కాజల్ కనిపించనుంది. మరి ఈ సినిమాతో అయినా.. బాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ వస్తుందేమో చూడాలి!