HomeTelugu Trendingబేబీ బంప్‌తో కాజల్‌.. ఫొటో వైరల్‌

బేబీ బంప్‌తో కాజల్‌.. ఫొటో వైరల్‌

Kajal aggarwal baby bump p

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్‌ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ తన బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ కనిపించేలా దిగిన ఈ ఫొటో షేర్ చేస్తూ 2022 అంటూ లవ్‌ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కాజల్ నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆమె నటించిన మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu