HomeTelugu Trendingబన్నీ సినిమాలో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌

బన్నీ సినిమాలో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌

7 15
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. రెగ్యులర్ సాంగ్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఐతే, అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో త్రివిక్రమ్ ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టు సమాచారం.

కాజల్, అల్లు అర్జున్ కలిసి ఆర్య 2 సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంది. చాలాకాలం తరువాత బన్నీ, కాజల్ కలిసి మరలా సినిమాలో కనిపించబోతున్నారు. ఐటెం సాంగ్ ఐనప్పటికీ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి. మరి త్రివిక్రమ్ ఈ సాంగ్ ను ఎలా డిజైన్ చేస్తున్నారో చూడాలి. జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదలకాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu