HomeTelugu Trending'బ్రైడ్‌ టు బి'.. కాజల్‌ బ్యాచిలరేట్‌ పార్టీ ఫొటోలు వైరల్‌

‘బ్రైడ్‌ టు బి’.. కాజల్‌ బ్యాచిలరేట్‌ పార్టీ ఫొటోలు వైరల్‌

Kajal Bachelorette Party Phటాలీవుడ్‌లో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగిన బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. 12 సంవత్సరాలుగా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ చందమామ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు నిన్న ప్రకటించన విషయం తెలిసిందే. తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును అక్టోబర్‌ 30న వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాజల్ బ్యాచిలరేట్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరున కాజల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్‌ కిచ్లు సోదరితోపాటు అతి తక్కువమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి.. ‘బ్రైడ్‌ టు బి’ క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ ఫొటోలను కాజల్‌ సెప్టెంబర్‌ 28న ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ.. అవి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ పిక్స్‌ అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. త్వరలో తాను గౌతమ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు కాజల్‌ ప్రకటించడంతో ఆనాటి ఫొటోలు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌-గౌతమ్‌లకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూన్నారు అభిమాలనులు.

పెళ్లి కబురు చెప్పిన చందమామ

Recent Articles English

Gallery

Recent Articles Telugu