HomeTelugu Trendingభర్తతో కాజల్‌ హోలీ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

భర్తతో కాజల్‌ హోలీ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

Kajal Holi celebrations wit
టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన త‌ర్వాత తొలి హోలీ పండుగ జ‌రుపుకుంది. అనంత‌రం హోలీ పండుగ తమ జీవితంలో సంతోషకరమైన రంగులు వెదజల్లుతోందని కాజల్ చెప్పుకొచ్చింది. ‘చిన్న‌ప్ప‌టి నుంచి హోలీ పండుగ‌కు నా జీవితంలో ప్ర‌త్యేక స్థానం ఉంది. పెళ్లైన త‌ర్వాత వ‌చ్చిన తొలి హోలీ పండుగ ఇది కాబ‌ట్టి ఎగ్జైటింగ్‌గా ఫీల‌వుతున్నాను. కోవిడ్ వ‌ల‌న ప‌రిమితంగా జ‌రుపుకుంటున్నాం.. సహజమైన సేంద్రీయ రంగులతో హోలీ వేడుకను ఎంజాయ్ చేస్తున్నాం..’ అంటూ కాజల్ పేర్కొంది. హోలీ సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు హోలీ విషెస్‌ చెబుతున్నారు. కాగా కజల్‌ తాజాగా విడుదలైన ‘మోసగాళ్లు’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Gautam Kitchlu (@kitchlug)

Recent Articles English

Gallery

Recent Articles Telugu