HomeTelugu Trendingహర్రర్ వెబ్‌సిరీస్‌లో కాజల్

హర్రర్ వెబ్‌సిరీస్‌లో కాజల్

Kajal in horror Web series
స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు ‘వెబ్ సిరీస్’ల బాట పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా అవకాశాలు లేని వారికి కూడా ఇది మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది. అందుకే టాలీవుడ్‌లో స్టార్‌హీరోలతో కలిసి నటించిన చాలామంది ముద్దుగుమ్మలు ఇప్పుడు వెబ్‌సిరీస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. వీరి జాబితాలోనే కాజల్ చందమామ కూడా రెడీ అవుతోంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ‘లైవ్ టెలికాస్ట్‌’ అనే వెబ్‌సిరీస్‌లో కాజల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాజల్‌తో హార్రర్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రభు వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం కాజల్ ఆచార్య సినిమాలో చిరంజీవితో నటిస్తోంది. మంచు విష్ణుతో మోసగాళ్లు చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu