‘కార్తికేయ-2 ‘ట్రైలర్‌ వచ్చేస్తుంది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. చందూ మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన సినిమానిజజ అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ.. అధికారిక పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్‌డేట్స్‌కి మంచి స్పందన వచ్చింది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఛేదించడానికి హీరో పూనుకోవడమే ఈ సినిమా కథ.

ఈ కథ మొదటి నుంచి చివరివరకూ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందనీ, తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని నిఖిల్ చెప్పాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.

CLICK HERE!! For the aha Latest Updates