HomeTelugu Trendingఆదాశర్మ సినిమాకి ఆసక్తికర టైటిల్‌

ఆదాశర్మ సినిమాకి ఆసక్తికర టైటిల్‌

Adah Sharma movie titledఆదాశర్మ నటిస్తున్న తాజా చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ‘?’ (క్వశ్చన్ మార్క్) అనే గమ్మత్తయిన టైటిల్ని పెట్టారు. దీనికి సంబంధించిన టైటిల్ లోగోని తాజగా రిలీజ్‌ చేశారు. విప్రా దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదా మాట్లాడతూ.. ఇది హారర్ సినిమా అనీ, దీనికి ‘?’ అనే టైటిల్ కరెక్టుగా సరిపోతుందని చెప్పింది. క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ ఏమిటి? ఎందుకు ఆ టైటిల్ పెట్టాం? అన్నవి ఆసక్తికరంగా ఉంటాయని చెప్పింది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, టైటిల్ కి మంచి స్పందన వస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనా కాలంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగుని పూర్తిచేశామని, హైదరాబాదు పరిసరాల్లోనే షూటింగ్ జరిపామని తెలిప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu