HomeTelugu Trendingఆ అమ్మడుతో మరోసారి చిరంజీవి కుమ్ముడు!

ఆ అమ్మడుతో మరోసారి చిరంజీవి కుమ్ముడు!

5 13

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ..కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. చిరు152 చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా అనుకున్నారు. కాకపోతే క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాలు రావడం వల్ల తాను ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకొంటున్నట్లు త్రిష తాజాగా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్రిష స్థానంలో కాజల్‌ నటించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘ఖైదీ నెం150’ చిత్రంతో చిరు-కాజల్ జంట ప్రేక్షకులను మెప్పించడంతో మూవీ యూనిట్‌ కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’, ‘ముంబయి సాగా’ చిత్రాలు ఉన్నాయి.

కొణిదెల ప్రాడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రను మహేశ్‌ పోషించనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu