చరణ్ హీరోయిన్‌ పెళ్లి అక్కడే జరుగుతుందట.!

టాలీవుడ్ లో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ఆ తరువాత శంకర్ ‘ఐ’, ‘2పాయింట్ 0’ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 2పాయింట్ 0 లో హ్యూమనాయిడ్ గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తరువాత అమీ మరే సినిమాకు సైన్ చేయలేదు. త్వరలోనే ఆమె ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నది.

చాలా రోజులుగా అమీ జాక్సన్, బ్రిటిష్ వ్యాపారవేత్త జార్జ్ పనయట్టుతో ప్రేమలో ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు. గ్రీస్ లోని మైకోనోస్ దీవుల్లో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకోబోతున్నారట. ఈ వివాహానికి ఎవరెవర్ని పిలుస్తున్నారన్నది తెలియాలి. అమీ కెరీర్లో బెస్ట్ హిట్ ఇచ్చిన శంకర్, హీరో రజినీకాంత్, పక్షిరాజా అక్షయ్ కుమార్ లకు ఆహ్వానం వస్తుందని ఆశిద్దాం.