HomeTelugu Trending'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ట్రైలర్‌

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్‌

Phalana Abbayi Phalana Amma

నాగ శౌర్య- మాళవిక నాయర్ హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది. ఈక్రమంలో ప్రమోషన్స్‌ ప్రారంభమైయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌లో నాగశౌర్య- మాళవిక నడుమ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. శౌర్య ఈ వీడియోలో రెండు దశల్లో యువకుడిగా కనిపిస్తున్నాడు. స్కూల్ పిల్లాడిలా ఒకటి.. గుబురు గడ్డంతో పరిణతి చెందిన యువకుడిగా మరోక్కటి. మాళవిక కూడా తన పాత్రలో ఒదిగిపోయింది.

Phalana Abbayi 1

ఇప్పటికే అవసరాల శ్రీనివాస్- నాగశౌర్య కాంబినేషన్ లో `ఊహలు గుసగుసలాడే` సినిమా వచ్చింది. ఈ సినిమా ఆహ్లాదకరమైన ప్రేమకథగా ఆకట్టుకుంది. ఇక నాగశౌర్య- మాళవిక కాంబినేషన్‌లో కూడా ఇది రెండో సినిమా. 2016లో విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈ జంట ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమాలో వీరి కాంబినేషన్‌ చాలా ప్లజెంట్‌గా కనిపించింది. ఇప్పుడు కూడా అంతే ప్రెష్‌ లుక్‌తో కనిపిస్తున్నారు ఈ హీరోహీరోయిన్‌లు.

`ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి` నిజ జీవితంలోని పాత్రలు నా జీవితంలోని సంఘటనల నుండి ప్రేరణ పొంది రాసానని అవసరాల అన్నారు. “ఇది సాధారణ కథ. ప్రజలకు దగ్గరగా ఉండే కథ. ఇది ఎక్కడో దూరంగా జరిగిన కథ కాదు.. !“ అని అవసరాల ఇటీవలి ఇంటర్వ్యూలో చెప్పారు.

చాలా సాధాసీదాగా చెప్పుకునే వాస్తవిక కథల ఆధారంగా తీసిన సినిమా ఇదని అన్నారు. దానికి తగ్గట్టే ప్రతి విజువల్ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu