HomeTelugu Big Storiesసుశాంత్‌ని వారే హత్య చేశారు.. కంగనా సంచలన వ్యాఖ్యలు..

సుశాంత్‌ని వారే హత్య చేశారు.. కంగనా సంచలన వ్యాఖ్యలు..

11 11

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్రంగా కలిచివేస్తోంది. అద్భుతమైన నటుడు, హిట్‌ సినిమాలు.. మంచి క్రేజ్‌ ఉన్న హీరో.. సడన్‌గా ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిలోనూ విషాదం నింపింది. దినిపై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్ళను ఎదగనివ్వరని ఆమె మండిపడింది.

దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియోను పోస్ట్ చేసిన కంగనా బాలీవుడ్ పెద్దలపై విమర్శలు గుప్పించింది. సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా చేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ నటుడుకు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు.? అంటూ ప్రశ్నించింది. ఇదంతా కూడా బాలీవుడ్ బడా సెలబ్రిటీలు పక్కా ప్లాన్ ప్రకారం చేసిందే. వారు కొత్తగా వచ్చేవారిని ప్రోత్యహించకపోగా వెనక్కి లాగుతారు. బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్‌ను తొక్కేస్తారు. సుశాంత్‌ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరి సంజయ్ దత్ గురించి బాలీవుడ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు. ఒకానొక టైమ్‌లో తన సినిమాలను చూడమని ఫ్యాన్స్‌ను విజ్ఞప్తి చేశాడు. తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటికి తోసేస్తారని వాపోయాడని కంగనా రనౌత్ గుర్తు చేసింది. ఆఖరికి నాపైనా కూడా ఆరు కేసులు బనాయించారు కంగనా చెప్పంది. బాలీవుడ్ పెద్దలు పెట్టిన స్ట్రెస్‌ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా మండిపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!