HomeTelugu Big Storiesఇండియా రిజెక్ట్ బాలీవుడ్.. కంగన సంచలన ట్వీట్

ఇండియా రిజెక్ట్ బాలీవుడ్.. కంగన సంచలన ట్వీట్

Reject Bollywood says Kangaబాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగన రనౌత్‌ తరచు ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌లో నెలకొన్న డ్రగ్స్, నెపోటిజం వంటి తదితర అంశాలపై పోరాడుతున్న ఈమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు ఉన్నారు, భారత చిత్ర పరిశ్రమ ఉంది, బాలీవుడ్ కూడా ఉంది. బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. అక్కడి నుంచి దొంగిలించారు. ఈ అవమానకరమైన పదాన్ని దయచేసి తిరస్కరించండి’ అని ట్వీట్ చేసింది. దీనికి తోడు ఇండియా రిజెక్ట్ బాలీవుడ్ అనే యాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది. కంగనా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కంగన జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu