తెల్లటి గడ్డం, కండలు తిరిగిన దేహంతో వెంకీ!

వెంకటేష్ ‘గురు’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ చూసిన వారంతా.. వెంకీను
పొగడకుండా ఉండలేరు. తెల్లటి గడ్డం, కండలు తిరిగిన దేహంతో ఫస్ట్ లుక్ అదిరిందనే చెప్పాలి.
మాధవన్ నటించిన సాలా ఖడూస్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్
కోచ్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం వెంకీ చాలా హోం వర్క్ చేశాడు. బాక్సింగ్ లో
ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. తన శరీర బరువును తగ్గించుకున్నాడు. ప్రేక్షకుల్లో కూడా ఈ
సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లుక్ తో సినిమాపై హైప్ మరింత పెరగడం
ఖాయం. డిసంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates