
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. రొమాంటిక్, కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగులో ఏప్రిల్ 28 న ‘కణ్మనీ రాంబో ఖతీజా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. దీంతో థియేటర్లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది….. అయితే తమిళంలో ఈ సినిమా బాగానే డబ్బులు చేసుకుందని నిర్మాతలు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు చెప్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.













