HomeTelugu Trendingసల్లూబాయ్‌కి విలన్‌ సుదీప్‌

సల్లూబాయ్‌కి విలన్‌ సుదీప్‌

2 17
సల్మాన్ ఖాన్ మూవీ ‘దబాంగ్’ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే మూడో పార్ట్ దబాంగ్ 3 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. దబాంగ్ 3 సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరోను తీసుకుంటున్నారని సమాచారం. రాజమౌళి ఈగ సినిమాలో మెయిన్ విలన్ గా చేసిన కిచ్చ సుదీప్… బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. దబాంగ్ 3 లో నటించేందుకు సుదీప్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుదీప్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu