HomeTelugu Trendingఆసక్తికరంగా సందీప్‌ కిషన్‌ కొత్త మూవీ పోస్టర్‌

ఆసక్తికరంగా సందీప్‌ కిషన్‌ కొత్త మూవీ పోస్టర్‌

Vi anand movie with sundeep

టాలీవుడ్‌ నటుడు యంగ్‌ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తాజా ‘గల్లీ రౌడీ’ సినిమాలో నటిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్‌లో వస్తుంది. ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ పాళ్లు ఎక్కువ కలిసిన ఈ యాక్షన్ సినిమాపై ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాను సందీప్ కిషన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రాజేశ్ దందా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్ట్‌ పోస్టర్ ను విడుదల చేశారు. గతంలో వీఐ ఆనంద్, సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన ‘టైగర్’ సినిమా హిట్ అయింది. మరి కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu