HomeTelugu Trendingరోడ్డుపైనే పైరసీ సీడీల విక్రయం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న నిఖిల్‌

రోడ్డుపైనే పైరసీ సీడీల విక్రయం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న నిఖిల్‌

2 8

యంగ్‌ హీరో నిఖిల్, టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులను నేరుగా కలుస్తోంది చిత్ర యూనిట్… దీనిలో భాగంగా శనివారం గుంటూరుకు వెళ్లిన హీరో నిఖిల్‌కు ఆశ్చర్యానికి గురిచేసే ఘటన ఎదురైంది. గుంటూరులోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు పయనమైన నిఖిల్.. మార్గం మధ్యలో.. టీ తాగేందుకు రోడ్డుపై ఆగారు.. అదే సమయంలో.. రోడ్డుపై ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను అమ్ముతోంది ఓ మహిళ… ఇది చూసి షాక్ తిన్న నిఖిల్.. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం.. ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి.. ఇలా, రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని సమాధానం ఇస్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నిఖిల్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu