శ‌ర‌వేగంగా ‘డిజె’ చిత్రీకరణ!

అల్లు అర్జున్ హీరోగా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌’. నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లోవ‌స్తోన్న మరో మ్యూజిక‌ల్ కాంబో ఇది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ఆడియెన్స్‌ను ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా అబుదాబిలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. శ్రీమ‌ణి రాసిన పాట‌ను దినేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేస్తున్నారు. సినిమా హైలైట్ పాయింట్స్‌లో ఈ సాంగ్ ఓ హైలైట్ అయ్యేలా ఈ సాంగ్‌ను తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్ని డ్యాన్సులు గురించి ఇక ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌న‌క్క‌ర్లేదు. ఈ సాంగ్ అభిమానుల‌కు క‌నుల పండుగ‌లా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెలియజేశారు.