అభ్యర్థి ఆస్తులు చూసి షాకైన ఎన్నికల అధికారి

కర్ణాటకలో 17 నియోజక వర్గాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికల్లో 17 మంది అనర్హత వేటుపడ్డ మాజీ ఎమ్మెల్యేల్లో 13 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. మిగతా నాలుగు చోట్ల వేరే వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా, డిసెంబర్ 5 న ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

బీజేపీ అభ్యర్థిగా ఎంటీబీ నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్లో అతని ఆస్తుల వివరాలు చూసి ఎన్నికల అధికారి షాక్ అయ్యాడు. నాగరాజు ఆస్తులు 18 నెలల కాలంలో రూ. 185కోట్ల రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం నాగరాజు, ఆయన భార్య శాంతకుమారి పేర్ల మీద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ.1201కోట్లు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.1015 కోట్లుగా చూపించిన సంగతి తెలిసిందే.