HomeTelugu Trendingవంటలక్క మూవీ ఎంట్రీ!

వంటలక్క మూవీ ఎంట్రీ!

Karthika Deepam vantalakk‘స్టార్‌ మా’ ఛానల్‌ ప్రసారం అవుతున్న’ కార్తీక దీపం’ సీరియల్ ఎంత ఫేమస్ తెలిసిందే. ఈ సీరియల్‌లో వంటలక్క పాత్రలో నటిస్తున్న మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘కార్తీక దీపం’ సీరియల్ తో కొన్ని లక్లల తెలుగు అభిమానులని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్‌. సోషల్ మీడియాలో ఈమె మంచి ఫాలోయింగ్‌ ఉంది.

వంటలక్క.. డాక్టర్ బాబు పై ఫన్నీ మీమ్స్ తో నెటిజనులు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇక ప్రేమి విశ్వనాథ్ తెలుగులో తెరకెక్కుతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి కరోనా రాకపోయి ఉంటే ఇప్పటికే ఆమె నటించిన ఓ చిత్రం కూడా విడుదల అయి ఉండేది అట. కరోనా ఎఫెక్ట్‌ తో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడిందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రేమీ విశ్వనాధ్. వంటలక్క సినిమా కోసం ఆమె ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచుస్తూన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu