HomeTelugu Trendingప్రభాస్‌ రాముడిలా లేడు: కస్తూరి

ప్రభాస్‌ రాముడిలా లేడు: కస్తూరి

Kasturi comments on Prabhas

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. రామాయణం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన ఘట్టాల ని తీసుకొని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ప్రెజెంట్ చేశారు.

ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ మంచి జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రను పోషించిన ప్రభాస్ లుక్ పై సినీ నటి కస్తూరి విమర్శలు చేసింది. ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన రాముడిలా లేరని, కర్ణుడిలా ఉన్నారని అన్నారు. రాముడిని, లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు.

తెలుగు సినిమాల్లో ఎంతో మంది నటులు రాముడి పాత్రల్లో తెరపై ఎంతో అందంగా కనిపించారని… కానీ ప్రభాస్ మాత్రం కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu