కాటమరాయుడు కలెక్షన్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు నుండి ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విడుదలైన తరువాత హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కు అదే రేంజ్ లో వసూలు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూసుకుంటే, నైజామ్ లో 10.71 కోట్లు.. వైజాగ్ లో 4.87 కోట్లు.. తూర్పు గోదావరిలో 4.61 కోట్లు.. పశ్చిమ గోదావరిలో 3. 55 కోట్లు.. కృష్ణాలో 2.74 కోట్లు.. గుంటూరులో 3.95 కోట్లు .. నెల్లూరులో 1.69 కోట్లు .. సీడెడ్ లో 5.55 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో 37.67 కోట్ల షేర్ ను సాధించింది. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలతో కాటమరాయుడు పోటీగా నిలుస్తాడో.. లేదో.. చూడాలి!