HomeTelugu Trendingఛాలెంజింగ్‌ పాత్రలో కీర్తి సురేష్‌!

ఛాలెంజింగ్‌ పాత్రలో కీర్తి సురేష్‌!

Keerthy suresh act in mimi

మహానటి సినిమాతో టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచుకుంది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటతో పాటు చిరంజీవి భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రం మిమి. కృతిసనన్‌ కీలక పాత్రలో లక్ష్మణ్‌ ఉత్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో కృతిససన్‌ నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇందులో భాగంగా కృతిసనన్‌ పాత్ర కోసం కీర్తిని సంప్రదించారట. స్క్రిప్ట్‌ విన్న కీర్తి సినిమా సినిమా చేసేందుకు అంగీకరించిందంట. అయితే, తుది నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదట. పెంగ్విన్‌ లో గర్భవతిగా, తల్లిగా కనిపించిన కీర్తి మరోసారి ఈ సినిమాలోనూ అటువంటి పాత్రే పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమా వెల్‌కమ్‌ ఒబామా పేరుతో తెలుగులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి మిమి లో ఎలాంటి మార్పులు చేసి, తెలుగు తెరపైకి తీసుకొస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరోవైపు కీర్తి సురేశ్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu