
Keerthy Suresh rejected Mahanati:
కీర్తి సురేష్ తన కెరీర్‌లో చాలా పెద్ద మలుపు తీసుకువచ్చిన చిత్రం ‘మహానటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆమె పాత్రను అంత గొప్పగా పోషించిన కీర్తి సురేష్ ఆ పాత్ర చేయడానికి ముందు నిరాకరించిందట. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
తాజాగా కీర్తి తన అనుభవాలను పంచుకుంటూ, మొదట ఈ చిత్రానికి ‘నో’ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “నాగ్ అశ్విన్ గారు నాలుగు గంటల పాటు కథ చెప్పారు. కానీ నేను ఆ పాత్ర చేయడానికి భయపడ్డాను. సావిత్రి గారి లాంటి మహా నటి జీవితకథను అందించడంలో తప్పు చేస్తే? అన్న భయం నన్ను వెనక్కి తగ్గేలా చేసింది” అని అన్నారు.
అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఉత్సాహంగా ఆమెను ప్రోత్సహించారట. “నాగ్ అశ్విన్ నాపై ఉంచిన నమ్మకం నాకు కావాల్సిన ధైర్యం ఇచ్చింది. సావిత్రి గారి వ్యక్తిగత జీవితాన్ని చూపించడంపై నా సందేహాలు నాకు ఉన్నా, టీమ్ నాపై చాలా విశ్వాసంతో ముందుకెళ్లింది” అని ఆమె చెప్పారు.
2018 మే 9న విడుదలైన మహానటి సినిమా కీర్తి జీవితాన్ని మార్చేసింది. నేషనల్ అవార్డు కూడా అందుకుని నటిగా ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. “మహానటితో వచ్చిన విజయాన్ని మళ్లీ పొందడం చాలా కష్టం. ఆ సమయంలో నేను తక్కువ అంచనాలతో సినిమాను చేశాను. అయితే, ఆ చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఊహించలేదు” అని ఆమె చెప్పారు కీర్తి సురేష్.
ALSO READ: Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!