HomeTelugu Trendingవివాదంలో కీర్తి సురేష్‌ తొలి సినిమా!

వివాదంలో కీర్తి సురేష్‌ తొలి సినిమా!

Keerthy suresh film in contహీరోయిన్‌ కీర్తి సురేష్‌ నటన, హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. టాలీవుడ్‌లో .. రామ్ నటించిన ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. అయితే నిజానికి కీర్తి డెబ్యూ మూవీ వేరే ఉంది. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ హీరోగా ఓ సినిమా చేసింది. ‘ఐనా ఇష్టం నువ్వు’ అనేది ఆ మూవీ టైటిల్. ఆర్ట్ డైరెక్టర్ కం నిర్మాత చంటి అడాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్ తొలిసారి ఈ మూవీతో దర్శకుడయ్యారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు . ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను మర్చి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మూవీయూనిట్. జానకి నేను అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుందని తెలుస్తుంది. చంటి అడ్డాల నుంచి ఈ మూవీ రిలీజ్ హక్కుల్ని తాను కొనుక్కున్నానని నట్టి కుమార్ వాదిస్తున్నారట. ఈ చిత్ర హక్కులను తాను కొనుగోలు చేశానని నిరూపించడానికి తన వద్ద అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలు ఉన్నాయని నట్టి చెబుతున్నారు. మరి ఈ సారైనా ఈ సినిమా విడుదల అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu