HomeTelugu Trendingవంశీ పైడపల్లి- విజయ్‌ సినిమాలో కీర్తి సురేష్‌!

వంశీ పైడపల్లి- విజయ్‌ సినిమాలో కీర్తి సురేష్‌!

Keerti suresh with vijay
కీర్తి సురేష్‌ ప్రస్తుతం మహేష్‌ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్‌ని ఎంచుకున్నట్టు, ప్రస్తుతం చిత్ర బృందం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక ఫిక్స్‌ అయితే హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ స్థాయి మరో మెట్టు ఎక్కుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu