తమిళం,తెలుగు రెండు భాషల సినిమాలతో బిజీగా ఉంది నటి కీర్తి సురేష్. ఇలాంటి బిజీ సమయంలోనే హిందీ పరిశ్రమలోకి అడుగిడుతోంది. స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాకి అమిత్ శర్మ డైరెక్ట్ చేయనున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ ప్లేయర్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు. ఈ చిత్రం పట్ల కీర్తి చాలా ఆసక్తిగా ఉందట. ఈ సినిమా ఆమెకు బాలీవుడ్ పరిశ్రమలో పాజిటివ్ ఫలితాన్నిస్తుందని ఆశిద్దాం.