HomeTelugu Trendingమలయాళీ కుట్టిగా మారిన కీర్తి సురేష్‌ లుక్‌.. వైరల్‌

మలయాళీ కుట్టిగా మారిన కీర్తి సురేష్‌ లుక్‌.. వైరల్‌

6 2
అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కీర్తి సురేష్‌ ..మహానటి’ సినిమా తో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ సినిమా తర్వాత ఈ భామ కథలను ఎంచుకోవటంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఆలస్యమైనా పర్వాలేదు కానీ మంచి సినిమాతో రావాలని ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ అనే సినిమాలో కీలక పాత్రపోషిస్తుంది. ఇప్పుడు ఉన్నటుంది మలయాళీ కుట్టి లా మారిపోయింది. మలయాళీ సాంప్రదాయ వస్త్రాల్లో మెరిసింది కీర్తి. అసలు విషయమేంటంటే.. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో `మరక్కర్ అరబిందలింటే సింహామ్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి మలయాళ కుట్టీగా కనిపించనుంది. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ విడుదలైంది. కీర్తి సురేష్ అక్కడి అమ్మాయే కాబట్టి అక్కడి సాంప్రదాయ వస్త్రాల్లో ఇట్టే ఒదిగిపోయింది. ఈ లుక్ పై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu