HomeTelugu Trendingమరో కొత్త సినిమా ప్రకటించిన కీర్తి సురేష్

మరో కొత్త సినిమా ప్రకటించిన కీర్తి సురేష్

Keerti suresh announced new‘మహానటి’ సినమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, ఉత్తమ జాతీయనటిగా పేరుతెచ్చుకుంది. ఆతరువాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ ‘రంగ్ దే’ ‘అన్నాతే’ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ వంటి సినిమాలలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మరో సినిమాను ప్రకటించింది. ‘సాని కాయిదం’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu