HomeTelugu Trending'కేజీఎఫ్‌- 2' ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘కేజీఎఫ్‌- 2’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

1 28‘కేజీఎఫ్‌’ చిత్రంతో కన్నడనాట రికార్డు సృష్టించిన నటుడు యష్‌‌. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఈ సినిమాలో నటిస్తుండడంతో సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ఈరోజు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన పాత్ర పేరు అధీర. తలపాగా చుట్టుకుని కళ్లు మాత్రమే కనిపించేలా తీర్చిదిద్దిన ఆయన లుక్‌ ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాకు కూడా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. హోంబళే ఫిలింస్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu