వినాయక చవితి కూడా రెస్ట్‌ లేదు.. మహేష్..!

ఈ నెలాఖరున సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు విదేశాలకు వెళ్లనున్నారు. మహేష్ 25 వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ లో షూట్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నది. అనుకున్న సమయానికి షూట్ కంప్లీట్ చేయాలనే సంకల్పంతో యూనిట్ ఉంది. సెప్టెంబర్ నెలాఖరుకు యూఎస్ షెడ్యూల్ కు వెళ్లాల్సి ఉన్నది. దీంతో వినాయక చవితి రోజున కూడా షూటింగ్ చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో మహేష్‌ బాబు గెడ్డం లుక్‌తో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.