HomeTelugu Trendingకేజీఎఫ్ చాప్టర్-2 న్యూ లుక్‌

కేజీఎఫ్ చాప్టర్-2 న్యూ లుక్‌

6 26
కేజీఎఫ్ చాప్టర్‌-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇందులో అధీర పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను విడుదల చేశారు. మరో రెండురోజుల్లో అధీర పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం అతని చేతులు, దానికి ఉన్న సింహపు ఉంగరం, గొంతును మాత్రమే వినిపించారు. ఇప్పుడు ప్రీలుక్‌లో సింహం ఉంగరాన్ని ధరించిన అధీర వెనక్కి చేతులు పెట్టుకున్న ఫొటోను విడుదల చేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌: చాప్టర్‌-1 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. విశేషంగా మాస్‌ను బాగా ఆకట్టుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాక ప్రపంచ చలన చరిత్రలో రికార్డుల మోత మోగించింది.

హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించిన యాక్షన్, మాఫియా ఉంటుందట. ముఖ్య పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరాగాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట. ఎమర్జెన్సీ స‌మ‌యంలో జ‌రిగిన క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలుస్తాయట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu